పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్టు స్కిల్స్ నేర్చుకోవలసిన అవసరం చాలా ఉందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ కాలేజ్ బాలికల వసతి గృహం -2 లో నిర్వహిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తున్న తరుణంలో కమ్యూనికేషన్స్, సాఫ్టు స్కిల్స్ నేర్చుకోవలసిన అవసరం చాలా ఉందన్నారు.