మచిలీపట్నం: దాడి చేసిన వారిని శిక్షించాలి

కృష్ణాజిల్లా చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాముపై జరిగిన దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని, న్యాయ విచారణ జరిపించాలని కృష్ణా జడ్పిటిసి, ఎంపీటీసీలు జిల్లా ఎస్పీ గంగాధర్ రావుకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక బీసీ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. మహిళ హోం మంత్రి అయ్యుండి ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్