మచిలీపట్నం: జిల్లా కేంద్రంలో విషాద సంఘటన

మచిలీపట్నం పట్టణంలో విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోతేపల్లి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న నర్రా రూతమ్మ మరణించి ఐదు రోజులు అయినా, ఈ విషయం బయటకు తెలియకుండా ఉండటం స్థానికులను కలవరపరిచింది.మృతురాలి కుమార్తె సుమతి మతిస్థిమితం లేకపోవడంతో, తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికి సమాచారం ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన వారిపై రాళ్లు విసురుతూ అల్లరి చేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు.

సంబంధిత పోస్ట్