మచిలీపట్నం: దోచుకున్నది దాచుకోవడానికే సింగపూర్ యాత్ర

ఏపీ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన కేవలం దోచుకున్న సొమ్మును దాచుకోవడానికేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, 100 రోజుల్లో గంజాయిని అరికడతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో చాక్లెట్లలో కూడా గంజాయి దొరుకుతోందని, గతంలో చేసిన ప్యాచ్ వర్క్ పనులు నాసిరకంగా ఉండటంతో రోడ్లపై గోతులు మళ్లీ పెరిగాయని మండిపడ్డారు. అనినీతిరహిత పరిపాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్ అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్