కాపు ఆడబిడ్డ జోలికి వస్తే ఊరుకునేది లేదని జనసేన నేతలు కొట్టే వెంకట్రావు శాయన శివ హెచ్చరించారు. గురువారం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శివపార్వతిని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగిన తాము అండగా వుంటామని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంత పెద్ద నేత ఊరుకునేది లేదని, బాధితులను బెదిరించడం దారుణం అన్నారు.