కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు న్యాయం జరగదా? అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. గురువారం మచిలీపట్నం ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న శివ పార్వతిని పరామర్శించారు. రాష్ట్ర మంత్రికి స్వయంగా అనుచరుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం కుమారుడు శివపార్వతి కుమార్తెను ప్రేమ పేరుతో మోసగించాడని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర సైతం టీడీపీ పక్షంగా ఉండడం దారుణం అని అన్నారు.