రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పల హారిక పేర్కొన్నారు. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందుతో ఆత్మహత్యకు పాల్పడిన మేకల శివ పార్వతిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. టీడీపీ నాయకుని కుమారుడు.. తన కుమార్తెను ప్రేమ పేరుతో మోసగించాడని శివపార్వతి ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళలు పాల్గొన్నారు.