ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జులై 11వ తేదీన మచిలీపట్నంలో జర్నలిస్టులకు 'వార్తాలాప్' మీడియా వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు పిఐబీ డైరెక్టర్ రత్నాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు వలందపాలెంలోని జి కన్వెన్షన్ లో నిర్వహించే ఈ వర్క్ షాప్ లో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ వర్క్ షాప్ లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.