మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నం వైసీపీ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు ఆదివారం రాత్రి మండిపడ్డారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ 'ఉప్పాల హారికపై దాడి జరిగితే కొల్లు రవీంద్ర ఆ దాడిని సమర్థించడం సిగ్గుచేటు' అన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కారులో వెళుతుంటే ఎవరైనా దాడి చేస్తే మీరు ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. తన భార్యపై జరిగిన దాడికి ఉప్పల రాము సరిగానే స్పందించారన్నారు.