ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, మంచి అలవాట్లతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన 56 మంది విద్యార్థులను ఆయన సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.