మచిలీపట్నం కొబ్బరితోటలో అక్రమ నిర్మాణాన్ని అధికారులు బుధవారం రాత్రి పోలీస్ బందోబస్తుతో పాక్షికంగా కూల్చివేశారు. గురువారం ఉదయం కూల్చివేత పనులు కొనసాగుతుండగా, వైసీపీ నేత పేర్ని కిట్టు అక్కడికి చేరుకున్నారు. కిట్టును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంకటాచలం అనే వ్యక్తి అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నారని ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.