మైలవరం నియోజకవర్గంలో 'సుపరిపాలనపై తొలి అడుగు' కార్యక్రమం సోమవారం నాటికి 13వ రోజుకు చేరింది. మైలవరం పట్టణంలోని పలు వాడల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సుపరిపాలన కార్యక్రమాన్ని మైలవరం మండల తెలుగు యువత అధ్యక్షులు లంక లతీష్ నాయకత్వంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.