వెల్వడంలో వ్యక్తుల మధ్య తీవ్ర వివాదం..

మైలవరం మండలం వెల్వడంలో గురువారం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పనికి వెళ్తున్న గోపాలరావు అనే వ్యక్తిపై కావాలని వివాదం పెట్టుకుని, పారతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో గోపాలరావు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రాణ రక్షణ కోసం బాధితులు మైలవరం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్