ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి హైవేపై మద్యం మత్తులో ఉన్న ఒక కానిస్టేబుల్ వేగ నియంత్రణ బారికేడ్లను ఢీకొట్టారు. దీనిని గమనించిన ఒక యువకుడు వెంటనే కానిస్టేబుల్ను అడ్డుకుని, 'సమాజాన్ని బాగు చేయాల్సిన పోలీసులే ఇలా తాగి తందనాలాడితే ఎలా?' అని నిలదీశారు. కానిస్టేబుల్కు వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయించాలని సదరు యువకుడు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు.