బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారు.. కొనకళ్ల

కొండపల్లిలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గురువారం మాట్లాడుతూ బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. బీసీలను అడ్డం పెట్టుకొని జోగి రమేశ్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు లేని సానుభూతి ఇప్పుడు ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి కుత్సిత రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్