మైలవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం సోమవారం హైదరాబాదులోని జవహర్ నగర్లో దారుణ హత్యకు గురయ్యారు. పిల్లలను పాఠశాలలో దింపి వస్తుండగా, ఆటోలో వెంబడించిన నలుగురు వ్యక్తులు కత్తులతో నరికి, బండ రాయితో మోది ఆయనను హత్య చేశారు. పాత కక్షలు, వ్యాపార వివాదాలే ఈ హత్యకు కారణాలని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.