ఇబ్రహీంపట్నంలో బుధవారం జరిగిన కమ్యూనిటీ మెంటల్ హెల్త్ & నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఆకాంక్షిత మండలాల్లో మానసిక ఆరోగ్య సేవలను విస్తరించాలని, నైపుణ్య శిక్షణలు ఆత్మనిర్భరతకు దోహదపడతాయని ఆమె తెలిపారు. RISE సెంటర్ శిక్షణలను వినియోగించుకుని మహిళలు, యువత స్వయం ఉపాధి పొందాలని సూచించారు.