ఇబ్రహీంపట్నంలో గురువారం మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకు వైసిపి నేతలు 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తగలబెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రస్థానం ఎన్టీఆర్ కు వెన్నుపోటుతో మొదలై నేటికీ కొనసాగుతోందని వైసిపి నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.