గిట్టుబాటు ధర లేక.. దళారుల పాలవుతున్న మొక్కజొన్న..

మైలవరం మార్కెట్ యార్డ్ లో వారాల తరబడి మొక్కజొన్న ఆరబోసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెల్వడం గ్రామానికి చెందిన ఒక రైతు, తాను పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో, వాతావరణ మార్పుల దృష్ట్యా తక్కువ ధరకు అమ్మేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్