కిలేశపురానికి చెందిన మాజీ సైనికుడు దార్నిచిన్న మార్యందేయులు అలియాస్ మార్క్స్ (లేటు)కు చెందిన 5 సెంట్ల నివేశన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని 'ప్రజా ప్రెస్ క్లబ్'లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు భావనమ్మతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మార్క్స్ భార్య, 70 ఏళ్ల దళిత వృద్ధురాలు భావనమ్మను అదే గ్రామానికి చెందిన వ్యక్తి బెదిరించి, దుర్భాషలాడి స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో, విజయవాడ సీపీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.