ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన డైరెక్టర్ విజయ్ కుమార్

మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో, ఒకరోజు ముందుగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్లవారుజాము నుంచే పెన్షన్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చే గౌరవమని ఆయన తెలిపారు. వైకాపా దుష్ప్రచారాలను నమ్మవద్దని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్