ఇబ్రహీంపట్నంలో అంబటి, జోగి రమేశ్ దిష్టిబొమ్మల దహనం

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని నిరసిస్తూ ఆదివారం సాయంత్రం రింగ్ సెంటర్లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ దిష్టిబొమ్మలను దహనం చేసి, సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని, సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటం తగదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

సంబంధిత పోస్ట్