జి.కొండూరు మండలం సున్నంపాడు గ్రామంలో పోస్టాఫీసు ఖాతాలో రెండు లక్షలు జమ చేసిన వ్యక్తి నగదు వివరాలు తెలుసుకునేందుకు గురువారం వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని చెప్పడంతో మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.22 లక్షల మేర ఖాతాదారులకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. దీనిపై అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించనున్నారు.