జి. కొండూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన పెన్షన్ కార్యక్రమంలో భాగంగా, మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ జరిగింది. మైలవరం నియోజకవర్గం తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకం సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకం ఇందిరా ప్రియదర్శిని ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.