జి. కొండూరు మండలంలో బీటీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ బుధవారం రూ. 8.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. విజయవాడ నుంచి కందులపాడు వరకు రూ. 2 కోట్లు, కందులపాడు నుంచి గణపవరం అడ్డరోడ్డు వరకు రూ. 6.90 కోట్లు రోడ్డు మరమ్మతులు, ప్యాచ్ వర్క్ లకు, మెయింటినెన్స్ ఖర్చులకు కేటాయించబడ్డాయి. ప్రజల సౌకర్యార్థం ఈ నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.