జి. కొండూరు: చెరువును కబ్జా చేసి పామ్ ఆయిల్ వేశారు

జి. కొండూరు మండలం భీమవరప్పాడు గ్రామ చెరువులో గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగు ఎకరాలను అక్రమార్కులు కబ్జా చేశారు. దశాబ్దాలుగా ఈ చెరువు నీటిపైనే ఆధారపడి సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా వ్యతిరేకించినా, అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. వైకాపా నేతలు నల్లబాపుల నారాయణ, నాగేశ్వరరావు 20 ఏళ్ల కిందటే చెరువులో కొంత భాగాన్ని ఆక్రమించి, లంచాలు ఇచ్చి దొంగ పత్రాలతో తమ పేరుపైకి మార్చుకున్నారు. న్యాయస్థానం గ్రామానికి చెందిన చెరువేనని తీర్పు ఇచ్చినా, ఇప్పటికీ చర్యలు శూన్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్