జి. కొండూరులో మంగళవారం వైసిపి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'కోటి సంతకాల సేకరణ', రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ, సర్పంచ్ మండల అరుణ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపు మేరకు గ్రామాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గ్రామాల వారీగా నిరసనలు చేపడతామని వైసిపి నాయకులు హెచ్చరించారు.