సోమవారం, జి. కొండూరు మండలంలోని గంగినేనిపాలెం, సున్నంపాడు గ్రామాలలో సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ, మైలవరం ఏసీపి ప్రసాదరావు, సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజలకు వివిధ నేరాలు, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్లైన్ ఫ్రాడ్‌ల గురించి అవగాహన కల్పించారు.