పొందుగల: దాహం తీరకుండానే నీరు వృధా..

మైలవరం మండలంలోని పొందుగల గ్రామంలో వేసవికాలంలో దాహార్తితో ప్రజలు అల్లాడుతుంటే, కృష్ణ నది నీరు వృధాగా మురికి కాలువలో కలిసిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. దారి తప్పిన కృష్ణ నీటిని తిరిగి గాడిలో పెట్టాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్