కీర్తిరాయునిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మైలవరం మండలం కీర్తరాయునిగూడెం గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి రాము, చంద్రాల పిఎసిఎస్ చైర్మన్ రాయల సత్య బాల కుమారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోందని, దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని రైతులకు సూచించారు. గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని, ధాన్యం అమ్మిన నెలల తర్వాత కూడా డబ్బులు జమ చేసేవారని, రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతు వ్యతిరేకి ప్రభుత్వం మధ్య తేడాను రైతులు గ్రహించాలని వారు తెలియజేశారు. కార్యక్రమంలో వీహెచ్ఏ, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్