మొంథా తుపాను ప్రభావంతో కొండపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాన ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులపై వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండపల్లి శివకృష్ణ థియేటర్ వెనుక డ్రైనేజీ పొంగి రోడ్డుపైన వరద నీరు వస్తోందని స్థానికులు తెలిపారు. గత ఏడాది బుడమేరు పొంగి ఇదే ప్రాంతంలో నడుము లోతు నీళ్లు వచ్చి ప్రజలు ఇబ్బంది పడ్డారు.