ఇబ్రహీంపట్నం: పసుపు నీళ్లతో దాసాంజనేయ స్వామి ఆలయ శుద్ధి

మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, దాసాంజనేయ స్వామి ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు శనివారం ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. కల్తీ మద్యం కేసులో 83 రోజులు జైలులో ఉన్నా జోగికి బుద్ధి రాలేదని మున్సిపల్ ఛైర్మన్ చిట్టిబాబు మండిపడ్డారు. ఆయన 'రోత' మాటల వల్ల ఆలయ పవిత్రత దెబ్బతిన్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్