ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చలానాలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ ఆర్ఎస్సై లక్ష్మణరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'మమ్మల్ని ఎవరూ చూడట్లేద'ని రాంగ్ రూట్లో వెళ్లే వారికి సీసీ కెమెరాలు ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ సిస్టం ద్వారా చలానాలు విధిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.