కొండపల్లి పట్టణ పరిధిలోని రహదారులపై ఆవులు, గేదెలను వదిలేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన హెచ్చరించారు. గురువారం ట్రాఫిక్ ఆర్ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో పట్టణంలోని పశువుల యజమానులకు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పశువులను ఇష్టానుసారంగా రోడ్లమీదకు వదలకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని అన్నారు. పశువులను రోడ్లపై వదిలితే గోశాలకు తరలిస్తామని, జరిమానాలు విధిస్తామన్నారు.