ఇబ్రహీంపట్నం (మం) జూపూడి పంచాయతీ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పంచాయతీ కార్యాలయం ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. గతంలో గంజాయి కేసులో పట్టుబడ్డ వ్యక్తిని తిరిగి నియమించాలని వైసీపీ ప్రయత్నించగా, టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ సభ్యులు టీడీపీ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ను కొనసాగించాలని స్థానికులు ఎంపీడీవోని కోరారు.