ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి మున్సిపాలిటీ 24వ డివిజన్లో శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. నాలుగు వేల పింఛన్తో జీవితం ప్రశాంతంగా సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి జంపాల సీతారామయ్య, కమీషనర్ రమ్య కీర్తన్, కౌన్సిలర్లు, కూటమి శ్రేణులు, అధికారులు హాజరయ్యారు.