వైసీపీ హయాంలో భారీ ఇసుక కుంభకోణం జరిగిందని శుక్రవారం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా, అవకాశం ఇస్తే సిట్ విచారణకు సహకరిస్తానన్నారు. ఇబ్రహీంపట్నంలో కొత్త పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలిపారు.