కొండపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్36 ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలి సీఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. లేని పక్షంలో జూలై 12 అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తామని సీఐటీయు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ అన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.