ఇబ్రహీంపట్నం: జోగి ఇంట్లో ధ్వంసమైనవి ఇవే

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. నిరసనకారులు పెట్రోల్ బాటిల్ విసరడంతో క్రిస్మస్ ట్రీ, డోర్ కర్టెన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ దాడితో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్