మైలవరం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు బిజిలి భవానిపై దాడిని సీఐటీయు కొండపల్లి మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ శుక్రవారం ఖండించింది. ట్రాక్టర్ షెడ్డు ఉమాపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన మహిళపై చులకన భావంతో దాడి, తీవ్ర పదజాలం ఉపయోగించడం అప్రజాస్వామికమని, న్యాయం చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.