మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 12వ తేదీ అర్థరాత్రి నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చిందని ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ శనివారం తెలిపారు. ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం రూ. 26, 000 ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.