ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ సెంటర్, ప్రభుత్వ హైస్కూలు వద్ద ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ బచ్చారావు తెలిపారు. అపోలో టైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్, టెన్నా, సీఎంఆర్ ఆటో, రాగ టెక్, వెస్ట్ సైడ్, జస్ట్ డయల్, సంతోష్ ఆటో, వీల్ స్మార్ట్స్, ఇండస్ ఇండ్ వంటి పలు కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదో తరగతి నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన, ఆరు నెలల అనుభవం ఉన్న మహిళలు, పురుష అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 12,500 నుంచి రూ. 25,000 వరకు జీతం ఉంటుంది. విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9247768718, 91546 67719 నంబర్లలో సంప్రదించవచ్చు.