నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు మరోసారి రిమాండ్

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టుకు హాజరుపరిచారు. పీటీ వారెంట్ ఆధారంగా ములకలచెరువు కేసులో భాగంగా వీరిని కోర్టు ముందు ఉంచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్