నకిలీ మద్యం కేసుల్లో సీజ్ చేసిన లాప్టాప్‌లను తెరిచేందుకు సిట్ అధికారులు జోగి రమేష్ కుమారులైన జోగి రాజీవ్, జోగి రోహిత్‌లను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్‌లో విచారించారు. న్యాయవాది సమక్షంలో జరిగిన ఈ విచారణలో, సీజ్ చేసిన ల్యాప్‌టాప్‌ల సర్వర్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.