కొండపల్లి మున్సిపాలిటీలోని పశు వైద్యశాలల్లో శుక్రవారం ఎస్సీ పాడి రైతులకు 50% సబ్సిడీపై సమీకృత దాణా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ప్రారంభించారు. పశు వైద్యాధికారి డాక్టర్ బి. స్వాతి అయ్యప్ప ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ రావు, అఫ్సర్, ప్రకాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.