కొండపల్లి కుమ్మరి బజారులో మట్టి వినాయకుల తయారీదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం జనసేన నేత అక్కల రామ్మోహన్రావు (గాంధీ), మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. మట్టి బొమ్మలు త్వరగా కరిగిపోతాయని, పర్యావరణానికి హాని కలగదని తెలిపారు. ఈ వినాయక చవితి మట్టి విగ్రహాలే వినియోగించాలని ప్రజలను కోరారు.