జి కొండూరు మండలం కౌవులూరు వద్ద గురువారం ప్రమాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కవులూరు వద్ద రోడ్డు నిర్మాణం కోసం గోపి (30) అనే డ్రైవర్ టిప్పర్ లారీలో కంకర్ తీసుకువెళ్లాడన్నారు. అన్లోడింగ్ చేసేందుకు టిప్పర్ లిఫ్ట్ లేపుగా పైన ఉన్న విద్యుత్ లైన్లు తగలడంతో లారీ డ్రైవర్ అక్కడక్కడికే మృతి చెందాడు అన్నారు. మృతుడు చెరువు మాధవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనికి కూతురు కొడుకు ఉన్నట్లు తెలిపారు.