మహానాడు - మాయనాడుగా మార్చుకుని మాయమాటలు చెప్తున్నారు.. జోగి

మాజీ మంత్రి జోగి రమేష్, మహానాడు పేరుతో చంద్రబాబు మహామోసం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానాడు వేదికగా సవాలు విసిరారు. ఈ సవాలును స్వీకరిస్తున్నామని, వైసిపి చర్చకు సిద్ధంగా ఉందని జోగి రమేష్ తెలిపారు. చర్చకు సమయం, తేదీ, స్థలం ఎంపిక చేసుకునే స్వేచ్ఛను తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నామని, అధికారంలో ఉన్నందున వారే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్