మైలవరంలో మంగళ, బుధవారాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని మండల సీపీఎం కార్యదర్శి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మామిడికాయలకు సరైన ధరలు లేక నష్టపోతున్న రైతులకు ఈ వర్షాలు మరింత నష్టాన్ని కలిగించాయని ఆయన అన్నారు. అధికారులు ఇప్పటివరకు నష్టపోయిన రైతుల పట్ల కనీసం దృష్టి సారించలేదని, వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.