పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి.. సీఐటీయూ

మున్సిపల్ కార్మికులతో సమానంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని, 132, 142, 680 జీఓలు, టెండర్లపై హైకోర్టు తీర్పు అమలు తదితర డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 12న సమ్మెలో పాల్గొంటున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మైలవరం పంచాయతీ కార్యదర్శి రఫీకి పంచాయతీ కార్మికులు గురువారం సమ్మె నోటీసు అందజేశారు.

సంబంధిత పోస్ట్